హిందీ బిగ్‌బాస్ హౌస్‌కు తొలి తమిళ నటి.. గ్లామర్ ట్రీట్
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైంది.
అదే రోజు హిందీ సీజన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అనేక మంది నటీనటులు అడుగుపెట్టారు.
వారిలో శృతికా అర్జున్ ఒకరు.
హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న తొలి తమిళ నటిగా ఈమె గుర్తింపు పొందారు. దీనిపై ఆమె స్పందిస్తూ..
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ హౌస్‌లోకి
ఒక కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
శృతికా అర్జున్ సినీ నేపథ్య కుటుంబానికి చెందిన నటి.
సీనియర్ నటుడు తేంగాయ్ శ్రీనివాసన్ మనవరాలు.
2002లో సూర్య హీరోగా నటించి విడుదలైన ‘శ్రీ’ చిత్రం ద్వారా ఆమె వెండితెర అరంగేట్రం చేశారు.
కొంతగ్యాప్ తర్వాత స్టార్ విజయ్ టెలివిజన్‌లో ప్రసారమైన కుక్ విత్ కోమాలి మూడో సీజన్‌లో పాల్గొన్నారు.
ఇపుడు హిందీ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి, తొలి రోజునే తన అందచందాలతో హావభావాలతో బుల్లితెర ప్రేక్షకులను అలరింపజేశారు.
ఆమె ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Related Web Stories
'మ్యాడ్' బ్యూటీ అనంతిక
అమితాబ్ బచ్చన్ నటవిశ్వరూపం.. ఈ సినిమాలు చూడాల్సిందే
ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు స్పెషల్....
రతన్ టాటా మరణం.. మన సెలబ్రిటీలు ఏమన్నారంటే!