నాగసాధువుగా తమన్నా.. ఏ స్టేజ్‌లో ఉందంటే
‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఓదెల 2’.
మహాదేవుని ఆశీస్సులతో వారణాసిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఇప్పటి వరకు ఎన్నో గ్లామర్ పాత్రలలో నటించి మిల్కీ బ్యూటీగా మారింది తమన్నా.
తన కెరీర్‌లోనే తొలిసారిగా తమన్నా ‘ఓదెల 2’లో శివశక్తి (నాగసాధు) పాత్ర పోషిస్తోంది.
తమన్నా మొదటిసారి ఓదెల విలేజ్‌లో షూటింగ్ చేస్తున్నారు.
ఆమెతో పాటు మురళీశర్మ, హెబ్బా పటేల్ తదితరులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది టీమ్.
దర్శకుడు సంపత్‌నంది పర్యవేక్షణలో అశోక్ తేజ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డి. మధు నిర్మిస్తున్నారు.
Related Web Stories
మాల్వీ మల్హోత్రాపై కత్తితో దాడి కేసులో కోర్టు తీర్పు ఇదే..
సంచార జాతుల వంటివారు.. హీరోలపై మాళవిక షాకింగ్ కామెంట్స్
నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం
చీరకట్టులో 'మల్లీశ్వరి'