‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాటపై తమన్నా సంచలన వ్యాఖ్యలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్‌’ చిత్రంలోని

‘కావాలయ్యా..’ ప్రత్యేక గీతంలో హీరోయిన్‌ తమన్నా డ్యాన్స్‌ అదరగొట్టింది. 

ఈ పాట ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. 

అయితే, ఈ పాటకు తాను పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయానని తమన్నా వెల్లడించారు. 

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 

‘కావాలయ్యా’ పాటకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాను.

నేను పూర్తిగా భాగస్వామ్యం కాలేకపోయాననే బాధ నాకు ఉంది. 

ఆ పాటను మరింత మెరుగ్గా చిత్రీకరించివుండొచ్చనే భావన కలిగిందన్నారు. 

అలాగే, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఈ పాటలో తమన్నాతో కలిసి 

డ్యాన్స్‌ చేయలేకపోయానంటూ తన మనసులోని మాట వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. 

ఏది ఏమైనా ‘జైలర్‌’ చిత్రం విజయంలో తమన్నా ప్రత్యేక గీతం కీలక పాత్ర పోషించిందనేది కాదనలేని సత్యం.