నవ్వుల నవాబు ‘రేలంగి’ పెళ్లి కార్డు చూశారా..

తెలుగు సినిమా కమెడియన్స్‌లో ఒకప్పటి స్టార్ కమెడియన్ రేలంగి

రేలంగి అనేది ఇంటి పేరు.. అసలాయన పేరు రేలంగి వెంకట్రామయ్య

రేలంగి 1910 ఆగస్టు 9న తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించారు.

రామదాసు, అచ్చయ్యమ్మలు రేలంగి తల్లిదండ్రులు

1935లో వచ్చిన ‘కృష్ణ తులాభారం’ చిత్రం రేలంగి మొదటి చిత్రం. ఈ సినిమాకు సి. పుల్లయ్య దర్శకుడు.

ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటుడిగా 300కి పైగా చిత్రాల్లో నటించారు

ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణం పోసినా.. హాస్యనటుడిగా స్టార్‌డమ్ అనుభవించారు.

రేలంగి సతీమణి పేరు బుచ్చియమ్మ. ఈమె పెంటపాడుకు చెందిన చేబోలు వీరాస్వామి కుమార్తె.

1933 డిసెంబరు 8వ తేదీన రేలంగి వివాహం వధువు స్వగృహంలో జరిగింది.

రేలంగి, బుచ్చియమ్మల వివాహ ఆహ్వాన పత్రిక ఇదే..