బ్లాక్‌లో 'కిస్సిక్‌'మనిపించిన శ్రీలీల

 శ్రీలీల ఈ పేరు మరోసారి టాలీవుడ్ లో మారుమోగిపోతుంది.

శ్రీకాంత్ తనయుడు రోషన్ 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగులో డెబ్యూ చేసిన ఆమె..

రవితేజ 'ధమాకా' సినిమాలో డ్యాన్స్ లతో స్క్రీన్ ని చింపేసింది.

తర్వాత నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నిరాశపరచగా..

భగవంత్ కేసరి, గుంటూరు కారం పర్వాలేదనిపించాయి.

తాజాగా 'పుష్ప 2'లో 'కిస్సిక్' స్పెషల్ సాంగ్ తో మరోసారి ట్రెండింగ్ లో నిలుస్తుంది.

నెక్స్ట్.. నితిన్ 'రాబిన్‌హుడ్'తో అదృష్టం పరిక్షించుకోనుంది.

అయితే ఆమె డ్యాన్స్ ఓకే కానీ నటనలోనే ప్రాబ్లమ్ ఉందని కొందరు విమర్శించారు.

తాజాగా ఆమె ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఆమె సెన్సిబుల్, కథల్లోనే ప్రాబ్లమ్ ఉందని అంటున్నారు.

నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'మాస్ జాతర' వంటి బిగ్ ప్రాజెక్స్ట్‌లో నటిస్తుంది.