అందమైన అమ్మాయ్ అన్నా అని పిలిచింది.. ఫీలయ్యా
అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది.
సరదాగా కాసేపు కబుర్లు చెప్పాలనిపించడమూ కామన్.
అయితే అప్పుడు ఆ అమ్మాయి ‘అన్నా’ అంటే మాత్రం అబ్బాయిలు తట్టుకోలేరు.
ఈ విషయంలో మన సినిమా హీరోలు కూడా అతీతం కాదు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితే శివకార్తీకేయన్‌కు ఎదురైందట.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘అమరన్’ ఆడియో వేడుకలో చెప్పారు.
నేను ఓ టీవీ చానెల్లో పనిచేసేటప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను.
అందులో ఓ షో కోసం నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పుడు సాయి పల్లవి ఆ కార్యక్రమానికి వచ్చారు.
ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్. ‘ప్రేమమ్’ సినిమాలో ఆమె నటనను చూసి ఫోన్ చేసి ప్రశంసించాను.
ఆమె అందుకు ‘థ్యాంక్యూ అన్నా’ అన్నారు. సాయి పల్లవి అలా పిలిచేసరికి ఫీల్ అయ్యా’’ అని చెప్పారు.
ఈ విషయాన్ని శివ కార్తీకేయన్ స్టేజీ మీద చెప్తున్ననంత సేపూ సాయి పల్లవి నవ్వుతూనే ఉన్నారు.
Related Web Stories
Shruti Haasan: ఎవరితోనైనా డేట్‌కి వెళ్తే.. బిల్లు నేనే చెల్లించేదాన్ని
అందం, అభినయం ఆమె సొంతం మీర్జాపూర్ 'బీనా త్రిపాఠి'
బుల్లితెర బ్యూటీ 'వర్షిణి సౌందరాజన్' గురించి ఇవి మీకు తెలుసా!
ముచ్చటగా మూడు సినిమాలతో మీనాక్షి...