బ‌ర్త్‌డే స్పెష‌ల్.. సిల్క్‌ స్మిత  బయోపిక్ గ్లింప్స్‌ విడుదల.. 

 సౌత్ ఇండియా సినిమా ప్రేమికులకు సిల్క్ స్మితా పేరును పరిచయం చేయడం అవసరం లేదు.

సౌత్‌ ఇండియాలో ఒకప్పుడు స్టార్‌ నటిగా వెలిగిన సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ రెడీ అవుతుంది.

ఇప్పుడు సౌత్ నుంచి సిల్క్ లైఫ్ స్టోరీపై మ‌రో సినిమా రాబోతుంది. 

సిల్క్ స్మితా ది క్వీన్ ఆఫ్ ది సౌత్ అంటూ ఈ సినిమా రాబోతుండ‌గా.. చంద్రికా రవి సిల్క్ పాత్రలో న‌టించ‌బోతుంది. 

ఈ చిత్రంతో జయరామ్ అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నేడు సిల్క్ స్మితా జయంతి సందర్భంగా ఈ చిత్రంతో సంబంధించిన కొన్ని గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.