‘నో’ చెప్పినా వాళ్లు వదల్లేదు
సమంత ఏంటి ఇలా అనేసింది అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే
రాజ్ అండ్ డీకే దర్వకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ ‘హనీ బన్నీ’.
సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నవంబరు 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దర్శకులు నన్ను ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ సిరీస్ కోసం సంప్రదించారు.
అయితే నా అనారోగ్య కారణాల రీత్యా నటించలేనని చెప్పాను.
అందుకు బదులుగా ఈ పాత్రకు సరిపోయే నలుగురు హీరోయిన్ల పేర్లను కూడా రాజ్ అండ్ డీకేకి సిఫార్సు చేశాను.
అయినా వాళ్లు నన్ను వదల్లేదు.. పట్టుబట్టి నా కోసం వెయిట్ చేశారని తెలిపారు.
ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో సమంత యమా చురుగ్గా పాల్గొంటోంది.
ఇటీవల ఓ ఈవెంట్‌లో తన కోసం టాలీవుడ్‌లో మంచి కథలు రాస్తే, చేయడానికి సిద్ధం అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Related Web Stories
Prakash Raj: జస్ట్ ఆస్కింగ్ కాదు.. జస్ట్ షూటింగ్
మిస్ ఇండియా 2024 'నిఖిత పోర్వాల్'
నీ కళ్ళు నీలి సముద్రం.. 'బేబమ్మ' న్యూ అవతార్
కీర్తి సురేష్ గురించి ఈ విషయాలు తెలుసా..