సమంత హీరోయిన్ గా పరిచయమైన చిత్రం 'ఏమాయ చేశావె'. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తి కావడంతో ఇదో కలలా ఉందంటోంది సామ్. ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో ప్రత్యేకం అని చెబుతోంది.
మహేష్‌తో నటించిన 'దూకుడు' చిత్రంతో స్టార్‌డమ్ సంపాదించుకుంది. అక్కడి నుంచి సామ్ వెనక్కి తిరిగిచూడలేదు. అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.
'ఏమాయ చేశావె' షూటింగ్‌లో నాగచైతన్యతో ప్రేమలో పడింది. 2017లో పెళ్లి చేసుకున్నారు.
టాలీవుడ్ బెస్ట్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట దురదృష్టవశాత్తు 2021లో విడాకులు తీసుకున్నారు.
రంగస్థలంలో రామలక్ష్మిగా మొదటిసారి డి-గ్లామర్ పాత్రలో నటించింది. 'పుష్ప'లో ఐటెం సొంగ్ తో అదరగొట్టటమే కాదు, 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ లో యాక్షన్ తోనూ మెప్పించింది.
ఏడాదిన్నరగా సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ విదేశాల్లో చికిత్స తీసుకుంటోంది. దాని వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత వెబ్ సిరీస్‌లతోనూ సామ్ బిజీ అయింది. త్వరలో హాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించబోతోంది.