రుహానిశర్మ అందాల దర్శనం కావాలంటే ఈ ఫొటోలు మిస్‌ కావద్దు..

అందానికి, హాట్‌ ఫొటో షూట్‌లకి నో లిమిట్‌ అంటున్న ఈ బ్యూటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

రుహానీ శర్మ హిమాచల్‌ ప్రదేశ్, సొలన్ లో జన్మించారు. చదువు పూర్తయ్యాక పంజాబీ మ్యూజిక్‌ వీడియోల్లో సందడి చేసింది.

2013 నుంచి ఇప్పటిదాకా 20కుపైగా మ్యూజిక్‌ వీడియోలతో యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. తర్వాత సినిమాల వైపు దృష్టి పెట్టింది.

సుశాంత్ హీరోగా  నటించిన 'చి.ల.సౌ' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై హిట్‌ అందుకొంది. ప్రస్తుతం వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తోంది.

హిట్‌, దర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్‌ చిత్రాలతో అలరించింది. ఇటీవల వెంకటేష్‌ హీరోగా 'సైంధవ్‌’లో మెరిసి మెప్పించింది.

తాజాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'ఆపరేషన్ వాలంటైన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. మార్చి ఒకటో తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.

తెలుగులోనే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలతో కూడా బిజీగా ఉంది రుహానీ, ప్రస్తుతం తెలుగులో 'శ్రీరంగ నీతులు’ చిత్రంలో నటిస్తోంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సిమ్లా బ్యూటీ తరచూ హాట్‌హాట్‌ ఫొటో షూట్‌లతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటుంది.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు  విపరీతంగా వైరల్ అవుతున్నాయి.