ఆయన పక్కన లేకపోతే...చాలా కష్టంగా ఉంది..

అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌ అగ్ర కథానాయికగా ఎదిగారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

 స్టార్‌ హీరోలు అందరితోనూ ఆమె యాక్ట్‌ చేసింది. 

జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత పూర్తిగా ముంబై మకాం మార్చేసింది

గతేడాది ఫిబ్రవరి 21న జాకీతో ఆమె పెళ్లి జరిగింది. ప్రేమ వివాహంతో ఒకటైన ఈ జంట..

ఇటీవలే తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు

షూటింగ్‌ సమయంలో తన భర్తను చాలా మిస్‌ అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు.

‘‘సినిమా షూటింగ్‌ సమయంలో మా ఆయనను బాగా మిస్‌ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. 

అయన పక్కన లేకపోతే చాలా కష్టంగా ఉంది..

ఆ సమయంలో అతనికి దూరంగా ఉన్నాను అనే ఫీల్‌ను పోగొట్టుకోవడానికి ఆయన స్వెట్‌ షర్ట్స్‌ను ధరిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

ఓ సెల్ఫీ ఫొటోను పంచుకుంది రకుల్‌. అందులో ఆమె ‘జేబీ’ అనే పేరుతో భర్త పేరును సూచించే హుడి  ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.