రాధికా ఆప్టే బేబీ బంప్ ఫొటోలు చూశారా..

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాధికా ఆప్టే రీసెంట్‌గా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఆమె తన బిడ్డతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆమెకు బాలీవుడ్ సెలబ్రిటీలెందరో శుభాకాంక్షలు తెలిపారు.

కెరీర్ పీక్స్‌లో ఉండగా 2012లో ఆమె బ్రిటీష్‌ వయొలనిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను వివాహం చేసుకుంది.

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లయ్యింది.

అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రాధికా ఆప్టే చేసిన పని బాగా వైరల్ అవుతోంది.

ఇంతకీ ఏం చేసిందని అనుకుంటున్నారా..

వోగ్ మ్యాగ్‌జైన్‌కి ఆమె బిడ్డ పుట్టక ముందు బేబీ బంప్‌తో ఫొటో షూట్ చేసింది. 

ఆ ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫొటోలు ప్రస్తుతం హాట్ టాపిక్‌ అవుతూ.. వైరల్ అవుతున్నాయి.

కాగా, రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులూ పరిచయమే.