డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండడంతో ఈ సినిమాకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి పుష్ప 2 సాంగ్స్. పుష్ప పుష్పరాజ్ సాంగ్ నుంచి మొన్న విడుదలైన పీలింగ్ సాంగ్ వరకు ప్రతి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర మొదలైంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో అల్లు అర్జున్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌కు చేరుకున్నారు.
ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అలాగే దాదాపు 1000 మంది పోలీసులు ఈ వేడుకకు బందోబస్త్ చేస్తున్నట్లు సమాచారం
ఈవెంట్ చుట్టుపక్కల ప్రదేశాలు అన్ని పోలీసు కనుసన్నల్లోనే ఉన్నాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగుకుండా ఉండేందుకు.
అలాగే భారీగా తరలివస్తున్న ఫ్యాన్స్ క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారు.
పుష్ప 2. అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్స్ ప్రీసేల్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల మార్కును చేరింది ఈ మూవీ.