తెలంగాణ ప్రభుత్వం నిర్మాత దిల్ రాజుని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది

ఈ నేపథ్యంలోనే టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఆయన ప్రమాణస్వీకారం చేశారు

కుటుంబసభ్యులతో కలిసి ఛాంబర్‌కు వచ్చి పదవీ బాధ్యతలు చేపట్టారు

2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు

టీఎఫ్‌డీసీకి పూర్వ వైభవం తీసుకురావాలి.. అందుకు అందరి సహకారం అవసరం

తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలి

టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నాపై ఎంతో బాధ్యత ఉంది

ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తా

సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు