బాబు కోసం ప్రియాంక కన్ఫార్మ్..

గ్లోబల్‌స్టార్‌, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా SSMB29లో నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే!

 తాజాగా ఆమె హైదరాబాద్‌ చేరుకున్నారు.

 మహేశ్‌- రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

మహేశ్‌బాబు, రాజమౌళి,కాంబినేషన్‌లో రాబోతున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29'కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

 ఇటీవల ఈ చిత్రాన్ని సైలెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి.

 ఈ సినిమా షూటింగ్‌పై త్వరలోనే అధికారిక అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు

ఇటీవల ఈ చిత్రం హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో మొదలైంది