ప్రభాస్ పెద్దమ్మ, లెజండరీ యాక్టర్ కృష్ణం రాజు భార్య ప్రభాస్ పెళ్ళి పై ఏమన్నారంటే

దీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్న పెళ్ళికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతుంది

పైనున్న కృష్ణం రాజు గారు అన్ని సవ్యంగా చూసుకుంటారు

ఇప్పటి వరకు అనుకున్నవన్నీ అనుకున్నట్లే అయ్యాయి

కుటుంబం మొత్తం ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఒకింటి వాడవుతాడా అంటూ వెయిట్ చేస్తున్నాము అని అన్నారు

ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు

ప్రస్తుతం ఆయన చేతిలో సలార్‌ 2, రాజాసాబ్‌, కల్కి 2, స్పిరిట్‌, హను రాఘవపూడితో ఓ చిత్రం ఉన్నాయి

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజాసాబ్‌’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు

వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నారు