ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ నటించే ఛాన్స్ వస్తుందో రాదో..
హీరో విజయ్‌తో కలిసి తాను నటించిన ‘బీస్ట్’ చిత్రాన్ని ప్రేక్షకులు అమితంగా ఆదరించారని,
వారి ప్రేమాభిమానాలు పొందడం కోసమే మరోమారు విజయ్ సరసన
నటిస్తున్నట్టు హీరోయిన్ పూజా హెగ్డే స్పష్టం చేశారు.
విజయ్ - పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన ‘బీస్ట్’ మూవీ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది.
కానీ, కలెక్షన్లపరంగా అదరగొట్టింది. ఈ నేపథ్యంలో విజయ్ నటించే
‘జన నాయగన్’లో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేశారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, ‘నేను, విజయ్ కలిసి నటించిన ‘బీస్ట్’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు.
ఆ తర్వాత విజయ్‌తో కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారంటూ అనేక ఇంటర్వ్యూల్లో ప్రశ్నించారు.
ప్రేక్షకుల ప్రేమాభిమానాలను మళ్ళీ పొందడం కోసం విజయ్ చిత్రంలో నటిస్తున్నాను.
పైగా ఈ అవకాశాన్ని కోల్పోతే మళ్ళీ నటించే ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు.
ఎందుకంటే ‘జన నాయగన్’ విజయ్ నటించే చివరి చిత్రమంటూ ప్రచారం సాగుతుంది.
విజయ్ నటిస్తూనే ఉండాలి. ఇది నా కోరిక మాత్రమే కాకుండా
కోట్లాది మంది విజయ్ అభిమానుల ఆశ కూడా అని పేర్కొన్నారు.
Related Web Stories
లెస్బియన్‌గా తెలుగు హీరోయిన్.. అంతకుముందు ఆ తర్వాత ఏమైందంటే
అబ్బాయిలు అలా ఉంటే నాకు బాగా నచ్చుతారు: ఖుషీ
నేను బికినీ వేసుకోవాలా, విప్పి తిరగాలా అనేది నా ఇష్టం
గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరోయిన్ రక్షిత