సంధ్య థియేటర్ ఘటన పై హైదరాబాద్  నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్  వీడియో విడుదల చేశారు

ఆ రోజు విధుల్లో ఉన్న ఏసీపీ, డీసీపీతో కలిసి సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు

ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది పోలీసులు ఎలా వ్యవహరించారు

విషయాలతో కూడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు

డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారని

హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని పోలీసులు చెప్పారు

అల్లు అర్జున్‌కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదని,

తొక్కిసలాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు ఎంత చెప్పిన వినిపించుకోలేదన్నారు

చివరకు డీసీపీ వెళ్లి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు