పుష్ప -2 రిలీజ్‌ సందర్భంగా సంధ్య  థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో  రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే

ఈ ఘటనపై అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది

అరెస్ట్ కాదని, విచారణకు మాత్రమే అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది

చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే

అల్లు అర్జున్ తరఫు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు

అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది

బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్‌ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని

అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు

దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది