పాయల్ రాజ్‌ఫుత్‌కు బంపరాఫర్

పాయల్ రాజ్‌పుత్ తెలుగు సినీ పరిశ్రమలో పేరు పొందిన అగ్ర హీరోయిన్. ఆమె గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

 ఆర్ఎక్స్ 100" సినిమా ద్వారా తెలుగు యూత్ గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. 

 ఈ భామ అందాలు, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. 

పాయల్‌ కు ఈ సినిమా,  ఆర్ఎక్స్ 100" ఎంతో పాపులారిటీ తెచ్చింది.

పంజాబీ సినిమాతో 'చన్నా మెరేయా'తో చిత్రసీమలో అరంగేట్రం చేసిన పాయల్ రాజ్ పుత్.

వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

సినిమాల్లోకి రాకముందు సీరియళ్లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ

ఎన్టీఆర్ బయోపిక్, 'ఆర్​డీఎక్స్ లవ్', 'వెంకీమామ' తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది పాయల్

మంగళవారం చిత్రం పాన్ ఇండియా చిత్రంగా వచ్చి మంచి విజయం అందుకుంది.

 పాయల్ రాజ్‌పుత్ మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్ మరియు అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నం. 1 అనే చిత్రంతో మరోసారి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతోంది.

 పాయల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమా జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. 

 పాయల్ ఈ సినిమాలో చాలా భావోద్వేగ పాత్రలో నటిస్తోంది అని తెలియజేశారు చిత్ర యూనిట్. 

ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారని సమాచారం.