నివేదా థామస్ గురించి  ఈ విషయాలు  మీకు తెలుసా?

 నివేదా థామస్ చెన్నైలో  పుట్టింది. అయితే వారి కుటుంబం మాత్రం కేరళకి చెందినవారు.

బాల నటిగా సీరియళ్లతో కెరీర్‌ ప్రారంభించిన ఆమె జెంటిల్‌మెన్  చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమైంది.

జెంటిల్‌మెన్ , నిన్నుకోరి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తదుపరి ఎన్టీఆర్‌లాంటి అగ్ర హీరో సరసన అవకాశం అందుకుంది.

నివేదా థామస్ ముద్దు పేరు కుక్కి. ఇంట్లో అంతా అలాగే పిలుస్తారు. సినిమాల్లో నటిస్తూనే ఆర్కిటెక్‌ చదువుతోంది. ఆరు భాషల్లో నివేథా మాట్లాడగలదు.

 సినిమా కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటుంది.

చిన్నప్పుడు టామ్‌ బాయ్‌లా, రౌడీబాయ్‌లా పెరిగింది. యాక్టర్‌ కాకపోతే వ్యోమగామి అవ్వాలనుకునేది.

ఎన్ని సినిమాలు చేశాం అన్నది కాదు.. చేసిన పాత్ర ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అన్నది చూస్తానంటోంది ఈ చెన్నై బ్యూటీ.

నివేదా థామస్ బ్యూటీ విత్  బ్రెయిన్ అని అంటారు. స్నేహితులన్నా, అభిమానులు అన్నా ఆమెకు ప్రాణం.

తెలుగులో తొలి చిత్రం నుంచే  డబ్బింగ్‌ చెబుతోంది. పాటలు పాడటం అంటే ఇష్టం.