ఉత్తమ నటి అవార్డ్.. నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది నిత్యామీనన్

‘తిరుచిట్రాంబలం’ సినిమాలో నటనకుగాను అవార్డ్ వరించింది

ఈ అవార్డ్ రావడం పట్ల నిత్యామీనన్ స్పందించింది

తొలి జాతీయ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది

‘తిరుచిట్రాంబలం’ చూస్తే.. నటన చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. కానీ,

ఆ నటన వెనుక ఎంతో శ్రమ దాగివుంది

అందులో నటన అంత సులభమైనది కాదు

జ్యూరీ సభ్యులు గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు

ఉత్తమ నటన అంటే ఒక నటుడు లేదా నటి.. 

బరువు తగ్గించడమో, పెంచడమో కాదు.. అలాగే

కృత్రిమ పద్ధతుల్లో బాడీ ట్రాన్స్‌ఫార్మింగ్‌ చేయడమో కాదు

ఈ చర్యలు నటనలో ఒక భాగమేగానీ, అదే నటన కాదు

దీన్ని నిరూపించే ప్రయత్నంలో ఉన్నాను 

ఇప్పుడీ అవార్డ్ నా ప్రయత్నానికి మరింత బలాన్నిచ్చింది

ఇకపై నటన విషయంలో మరింతగా దృష్టి పెడతాను

ఈ అవార్డ్‌కు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

ఇప్పుడు నటిగా నా బాధ్యత మరింత పెరిగినట్లుగా భావిస్తున్నా..