నిహారిక నిర్మాతగా రెండో సినిమా..
నటనతో పాటు చిత్ర నిర్మాణానికి నిహారిక కొణిదెల ప్రాధాన్యం ఇస్తోంది.
'కమిటీ కుర్రోళ్ళు' తర్వాత వెబ్ సీరిస్ నిర్మించిన నిహారిక త్వరలో రె
ండో సినిమాకు శ్రీకారం చుట్టబోతోంది.
గత యేడాది ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం చక్కని విజయాన్ని అందుకుంది.
అంతేకాదు... చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త ఆశలు రేపింది.
ఆ వెనుకే వచ్చిన 'ఆయ్' చిత్రమూ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ బాటలో మరిన్ని చిన్న చిత్రాలు జనం ముందుకు వచ్చాయి.
'కమిటీ కుర్రోళ్ళు' విజయం ఇచ్చిన స్ఫూర్తితో నిహారిక కొణిదల మరో సినిమాకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతోంది.
ఈ సినిమా ద్వారా ఆమె
మానస శర్మ
ను వెండితెరకు పరిచయం చేయనుంది.
ఇప్పటికే మనస శర్మ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లోనే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేసింది.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో 3వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.
Related Web Stories
అనసూయ అందాలు.. ఇసుక తిన్నెల్లో..
ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..పుష్ప-3 ఎప్పుడంటే..
రుక్సర్ ధిల్లాన్ తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తోంది
ఐఫా 2025 వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు.