ఏ ఔట్‌ ఫిట్‌ ధరించినా అందంగా  కనిపిస్తుంది నిధి అగర్వాల్‌ 

తాజాగా సాంప్రదాయబద్దమైన చీర కట్టులో కనిపించి ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేసింది

అందమైన పట్టు చీర కట్టులో నిధి అగర్వాల్‌ ఆకట్టుకుంది అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు

అందంతో ఆకట్టుకోవడంతో పాటు తనకు ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లోనూ రాణిస్తూ వస్తోంది

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది నిధి అగర్వాల్‌

తర్వాత అఖిల్‌ సినిమా మిస్టర్ మజ్ను సినిమాలో నటించిన విషయం తెల్సిందే

ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా నిధి అగర్వాల్‌కి ఆఫర్లు మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాయి

రామ్‌ కి జోడీగా నటించిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

బాక్సాఫీస్ వద్ద ఇస్మార్ట్‌ శంకర్‌ పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో నిధి అగర్వాల్‌ బిజీ అయ్యింది

తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా హరి హర వీరమల్లు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది

ఆ సినిమాలో ఈ అమ్మడు రాజకుమారి పాత్రలో కనిపించబోతుంది