నయనతారకు  సర్జరీ జరిగిందా?

నయనతార ప్లాస్టిక్‌ సర్జరీ   చేయించుకున్నట్లు  వచ్చిన వార్తలను ఖండించారు.

దేవుడు ఇచ్చిన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు.  ఆ ఆలోచన కూడా రాలేదు.

నా కనుబొమ్మలు అంటే నాకు చాలా  ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ  ఉంటాను.

ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు  వాటిని మార్చుతుంటాను. వాటి కోసం  ఎంతో సమయాన్ని కేటాయిస్తాను.

కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది

బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని అనుకుంటున్నారు. వాళ్లు అనుకున్నది నిజం కాదు

  డైటింగ్‌ వల్ల కూడా నా ముఖంలో   మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గలు  వచ్చినట్లు కనిపిస్తుంటాయి

ఒక్కోసారి బుగ్గలు లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుంది. కావాలంటే మీరు నన్ను  గిచ్చి చూడొచ్చు

' నా శరీరం లో ఎక్కడ ప్లాస్టిక్ లేదు'  అని చెప్పింది

గతేడాది 3 సినిమాలతో అలరించిన  నయన్‌ ప్రస్తుతం ఐదు సినిమాలతో  బిజీగా ఉన్నారు.