అక్కినేని ఇంట్లో చైతన్య, శోభితల  హల్దీ వేడుక నిర్వహించారు ఇరువురికి  మంగళ స్నానాలు చేయించారు

వీరిద్దరి పెళ్లిని డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో‌ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు

ఈ పెళ్లి వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు కూడిన 300 మందిని మాత్రమే ఆహ్వానించనున్నారు

మరోవైపు ఈ పెళ్లిని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి 

కానీ.. ఆ వార్తల్లో నిజం లేదని అక్కినేని వర్గాలు గట్టిగా చెబుతున్నాయి

ఈ పెళ్లిని ప్రైవేట్ గా, అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహిస్తారని తెలిపారు

చైతన్య మాట్లాడుతూ.. తన జీవితంలో ఏర్పడిన వెలితిని శోభిత పూర్తి చేస్తుందన్నారు

ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని  ప్రారంభించేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానని అన్నారు

అలాగే, అన్నపూర్ణ స్టూడియోస్‌ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం

స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగనుంది

ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి అన్నారు