సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
అయ్యింది
రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది
మంచు ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో మూడ్రోజులపాటు హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే
మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది
తనపై దాడి జరిగిందంటూ పోలీసులను మనోజ్ ఆశ్రయించగా,
మనోజ్,అతని భార్యతో తనకు హాని ఉందని రాచకొండ పోలీసులకు మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు
ఈ సమయంలోనే తనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంపై హైకోర్టును ఆయన ఆశ్రయించారు
ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు
కాగా, నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం మోహన్ బాబు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలురించింది
Related Web Stories
కేసును కొట్టి వేయాలని బన్ని హైకోర్టులో పిటిషన్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది
ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్