‘వాన’ బ్యూటీ పెళ్లి చేసుకుంది.. పెళ్లి ఫొటోలు వైరల్

హీరోయిన్ మీరా చోప్రా వివాహబంధంలోకి అడుగుపెట్టింది

వ్యాపారవేత్త రక్షిత్‌ కేజ్రీవాల్‌ను ఆమె పెళ్లాడింది

మంగళవారం (మార్చి12) జైపూర్‌లో మీరా చోప్రా, రక్షిత్ కేజ్రీవాల్ వివాహం ఘనంగా జరిగింది

కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ప్రేమజంట ఒక్కటయ్యారు

ఇంతకు ముందు తను ప్రేమలో ఉన్నట్లుగా మీరా చోప్రానే తెలిపింది

పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’ సినిమాతో మీరా చోప్రా టాలీవుడ్‌లో ఫేమస్ అయింది

‘వాన’ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాలలో ఆమె నటించారు.

టాలీవుడ్‌లో సరైన హిట్ లేకపోవడంతో ఇతర ఇండస్ట్రీలలోనూ ప్రయత్నించింది

అయినా ఫలితం లేకపోవడంతో.. ప్రియుడిని పెళ్లాడి వివాహబంధంలోకి అడుగెట్టింది.