అన్షు అంబానీ కాదు.. అన్షు సాగర్: ‘మన్మథుడు’ అన్షు ముచ్చట్లివే!
‘మన్మథుడు’ సినిమాలో ముద్దుముద్దుగా కనిపించి అందరి హృదయాలను దోచేసింది అన్షు.
చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమైంది.
‘ధమాకా’ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘మజాకా’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.
రీఎంట్రీ ఇస్తున్న అన్షు.. కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
అంబానీ అనేది చాలా పాపులర్ సర్ నేమ్. అయితే నా ఇంటిపేరు అది కాదు.
అసలు అంబానీ అనే పేరు నాకు ఎలా వచ్చిందో కూడా తెలీదు.
నా పేరు అన్షు. నాకు ఇంటి పేరు వుంది కానీ ఆ పేరు ఎక్కడా వాడలేదు.
నేను సచిన్ సాగర్‌ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అన్షు సాగర్.
నేను 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేశాను. అప్పటికి అంత ఎమోషనల్ మెచ్యురిటీ లేదు.
ఒకవేళ మన్మథుడు నా 25 ఏళ్ల వయసులో చేసి వుంటే సినిమాల్లోనే కొనసాగడానికి ఆలోచించేదాన్ని.
అప్పటికి నా చదువు కూడా పూర్తి కాలేదు. లండన్ వెళ్ళిపోయాను.
కాలేజ్ పూర్తి చేసి మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను.
సొంతగా క్లీనిక్ పెట్టాను. 24 ఏళ్లకి పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఇది బ్యూటీఫుల్ జర్నీ.
మళ్ళీ సినిమాల్లో చేయాలని వుండేది. మన్మథుడు రీ రిలీజ్ కి వచ్చిన రెస్పాన్స్ నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది.
ఇంట్లో వారి సపోర్ట్‌తో మళ్ళీ ‘మజాకా’తో తెరపైకి రావడం ఆనందంగా వుంది.
ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ క్యారెక్టర్స్ కోసం సంప్రదిస్తున్నారు.
ఇందులో చాలా మదర్ రోల్స్ వున్నాయి. అయితే కేవలం ఒకే తరహ పాత్రలు చేయాలని లేదు.
ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శక నిర్మాతలు మరిన్ని వైవిధ్యమైన పాత్రల కోసం అప్రోచ్ అవుతారనే నమ్మకం వుంది.
ఎలాంటి క్యారెక్టర్ చేసినా కథ పరంగా మంచి స్ట్రెంత్ వున్న క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతాను.
మళ్ళీ నటించడానికే వచ్చాను. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్స్ చేయాలని వుంది.
Related Web Stories
ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ నటించే ఛాన్స్ వస్తుందో రాదో..
లెస్బియన్‌గా తెలుగు హీరోయిన్.. అంతకుముందు ఆ తర్వాత ఏమైందంటే
అబ్బాయిలు అలా ఉంటే నాకు బాగా నచ్చుతారు: ఖుషీ
నేను బికినీ వేసుకోవాలా, విప్పి తిరగాలా అనేది నా ఇష్టం