ఒకప్పుడు సాధారణంగా కనిపించిన మంగ్లీ ఇప్పుడు మేకోవర్ మొత్తం మార్చేసింది.
చిత్తూరుకు చెందిన మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. సంగీత రంగంలోకి వచ్చాక మంగ్లీగా పేరు మార్చుకుంది.
ఓ న్యూస్ ఛానల్‌లో ప్రసారమైన ధూంధాం షోతో పాపులర్ అయింది. బతుకమ్మ, దసరా, బోనాల పాటలతో జనాల్లోకి వెళ్లింది.
మాస్ బీట్ సాంగ్స్‌కు మంగ్లీ కేరాఫ్‌గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఆమె కూడా ఒకరు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా తళుక్కుమంటున్నారు.
'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'రాములో రాముల’ పాటతో ఒక్కసారిగా స్టార్ సింగర్‌గా మారిపోయింది. ఆ తర్వాత సారంగదరియా, రారా రక్కమ్మ పాటలతో మరింత గుర్తింపు సొంతం చేసుకుంది.
సినిమాకు సంబంధం లేని ప్రైవేట్ ఆల్బమ్స్ 30కి పైగా చేసింది. నాలుగేళ్లగా ప్రతి శివరాత్రికి శివుడిపై ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేస్తోంది.
శ్రీకాళహస్తి దేవాలయంలో మంగ్లీ షూట్ చేసిన ఓ పాటతో వివాదాల పాలైంది. పాట బయటకు వచ్చాక ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సూపర్‌సింగర్స్‌కు జడ్జ్ అయ్యాక మొత్తం లుక్కే మార్చేసింది. స్టైలిష్‌గా తయారైంది.
గత ఏడాది హైదరాబాద్‌లో సద్గురు ఏర్పాటు చేసిన సేవ్ సాయిల్ క్యాంపెయిన్ లో భాగంగా సద్గురుతో కలిసి స్టేజ్ షేర్ చేసుకుని ఓ పాట పాడారు మంగ్లి.
ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో టాప్ సింగర్ శంకర్ మహదేవన్ తో కలిసి పాడారు మంగ్లి. అలాగే తమన్నా, పూజా హెగ్డే లాంటి స్టార్‌లతో కలిసి నాట్యమాడారు.