ఓయ్ మాళవికా.. మానవా ఇక!

పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ 

హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ మాత్రం అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్నారు. 

అప్పుడప్పుడూ స్పెషల్‌ ఫొటో క్లిక్స్‌తో ఆమె ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. 

తాజాగా ఆమె కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, అవి వైరల్‌ అయ్యాయి.

ఇటీవల పా.రంజిత్‌ దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ ‘తంగలాన్‌’ చిత్రంలో నటించిన మాళవిక... 

ప్రస్తుతం కార్తీ హీరోగా నటించే ‘సర్దార్‌-2’లో నటించే ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నారు.

అలాగే, ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్‌’లో నటించారు. 

ఈ సినిమా ద్వారా ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.

ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో భారీ సంఖ్యలో ఫాలోయర్లను కలిగిన మాళవిక..

కోలీవుడ్‌కు ‘మాస్టర్‌’ మూవీ ద్వారా పరిచయమైన విషయం తెల్సిందే. 

ఇండస్ట్రీకి పరిచయమైన అతితక్కువకాలంలోనే 

ఆమె తనకంటూ ఓ స్థానాన్ని, గుర్తింపు సంపాదించుకున్నారు.

సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలతో.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు.