విజయ్ దేవరకొండ 10వ తరగతి వరకు, పుట్టపర్తి సత్య సాయి స్కూల్ లో, ఇంటర్, డిగ్రీ, హైదరాబాదులో చదివాడు. థియేటర్ లో నటుడిగా రాణించాడు

విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి. తండ్రి టీవీ సీరియల్ దర్శకుడుగా పనిచేశారు

విజయ్ దేవరకొండ, అల్లరి రవిబాబు సినిమా 'నువ్విలా' (2011), తరువాత శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (2012) సినిమాలో చిన్న పాత్ర చేశాడు. 

'ఎవడె సుబ్రహ్మణ్యం' (2015) సినిమా విజయ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చింది. నాని ఇందులో కథానాయకుడు

కథానాయకుడిగా చేసిన మొదటి సినిమా 'పెళ్లి చూపులు' (2016) ఘన విజయం సాధించటంతో విజయ్ అనే పేరు ప్రపంచం మొత్తం తెలిసింది. తరుణ్ భాస్కర్ దర్శకుడు

'అర్జున్ రెడ్డి' అనే సినిమా విజయ్ కెరీర్ లోనే కాకుండా, పరిశ్రమలో కూడా ఒక మలుపు. సందీప్ వంగా దర్శకుడు.

ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు 'అర్జున్ రెడ్డి' కి వచ్చింది. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మాన్ గా 2019లో 

'రౌడీ' అనే ఒక ఫ్యాషన్ బ్రాండ్ ని కూడా విజయ్ లాంచ్ చేశాడు

విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా గుర్తింపు పొందిన నటుల్లో ఇప్పుడు ఒకరు 

కథానాయకుడిగా చేసిన నాలుగో సినిమా 'గీతగోవిందం' విజయ్ కెరీర్ లో ఇంకొక అద్భుతం. ఆ సినిమా వందకోట్ల క్లబ్బులోకి చేరింది 

'లైగర్' (2022) అనే పాన్ ఇండియా సినిమా విజయ్ కెరీర్ లో ఒక డిజాస్టర్ మూవీ, పూరి జగన్ దర్శకుడు 

'లైగర్' సినిమా పరాజయం విజయ్ కెరీర్ పై చాలా ప్రభావం చూపించింది అని విశ్లేషకుల అభిప్రాయం 

విజయ్, మృణాల్ జంటగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' తాజాగా విడుదలయింది, పరశురామ్ పెట్ల దర్శకుడు.