శ్రియ రెడ్డి, ప్రముఖ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె. భరత్ రెడ్డి ఇండియాకి, తమిళ నాడు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 

శ్రియ రెడ్డి వీడియో జాకీగా ఒక ప్రముఖ మ్యూజిక్ ఛానల్ లో తన కెరీర్ ని ప్రారంభించారు . 

అప్పట్లో వీడియో జాకీగా చాలా పాపులర్ అయ్యారు శ్రియ, ముఖ్యంగా యువతలో ఆమె క్రేజ్ అంతా ఇంతా కాదు 

తరువాత 2003లో చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన 'అప్పుడప్పుడు' అనే సినిమా ద్వారా అరంగేట్రం 

మొదట విడుదలైనది మాత్రం తమిళ సినిమా 'సమురాయ్', బాలాజీ శక్తివేల్ దర్శకుడు. విక్రమ్ కథానాయకుడు 

మూడో సినిమా మలయాళంలో వచ్చిన 'బ్లాక్'. మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి ఇందులో కథానాయకుడు 

2005 లో మలయాళంలో వచ్చిన 'భరత్ చంద్రన్ ఐపీఎస్' పెద్ద విజయం, శ్రియరెడ్డిని విజయశాంతితో పోల్చారు

2006లో వచ్చిన 'తిమురు/పొగరు' అనే సినిమాలో శ్రియ ఒక నెగటివ్ రోల్ చేసి, విమర్శకుల ప్రశంశలు పొందారు. ఇందులో విశాల్ కథానాయకుడు 

2008లో విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణని వివాహం చేసుకున్నాక నటనకి బ్రేక్ ఇచ్చారు 

చాలా కాలం తరువాత ప్రభాస్ నటించిన 'సలార్' ద్వారా మళ్ళీ వెండితెరపైకి వచ్చిన శ్రియ. ఇప్పుడు 'ఓజి' లో కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్న శ్రియ, తాజా వెబ్ సిరీస్ 'తలైమై సేయలగం' జీ5 లో ప్రసారం అవుతోంది.