విమర్శల్ని పట్టించుకోనంటున్న కియారా అద్వానీ.

తెలుగు ప్రేక్షకులకు కియారా అద్వానీ బాగా పరిచయమే. 

భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలలో నటించిన ఈ భామ

తాజాగా ‘గేమ్ చేంజర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రీసెంట్‌గా ఆమె ఈ సంవత్సరం తన తీర్మానాల గురించి మాట్లాడింది.

సాధ్యాసాధ్యాలతో పని లేకుండా, శక్తికి మించి ఏవేవో పెద్ద పెద్ద లక్ష్యాల్ని పెట్టుకుంటారు చాలామంది. 

తీరా వాటిని చేరుకోలేక చతికిలపడతారు. 

కాబట్టి శక్తికి మించి ఆలోచించడం కరెక్ట్‌ కాదు. 

వంద శాతం చేయగలమనుకున్న పనుల్నే తీర్మానాలుగా తీసుకోవాలి. 

అప్పుడే వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను ఆస్వాదించగలుగుతాం. 

నేనైతే ఈ ఏడాదిలో విమర్శల్ని పట్టించుకోకుండా, 

పాజిటివిటీతో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నా. 

అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని, 

నా భర్తతో మరింత సమయం గడపాలని నిర్ణయించుకున్నా.