పెళ్లి తర్వాత బోల్డ్ అండ్ ట్రెడిషనల్‌గా కీర్తి సురేష్

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ఇటీవల తన చిరకాల మిత్రుడు ఆంటోనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే

కాగా, ఆమె సోషల్ మీడియాలో పెళ్లి తర్వాతే ఎక్కువ బోల్డ్ ఫోటోలు పెడుతున్నారు..

దీంతో అభిమానులంతా షాక్ అవుతున్నారు..

 లుక్ ఎంత బోల్డ్‌గా ఉన్న సరే ఆమె మెడలో పసుపు తాడు మాత్రం తీసేయడం లేదు.

దీని గురించి ఆమెను మీడియా ప్రశ్నించగా..

దక్షిణాదిలో ఒక సంప్రదాయం ఉంది. పెళ్లి సమయంలో వధువు మెడలో వరుడు పసుపుతాడు కడతాడు

దానిని మేమెంతో పవిత్రంగా భావిస్తాం..

పెళ్లైన కొన్ని రోజులకు ఒక మంచి ముహూర్తం చూసి మంగళ సూత్రాలను బంగారు చైన్‌లోకి మార్చుకుంటాం

జనవరి చివరివరకూ మంచి రోజులు లేవు..

అప్పటివరకూ నేను ఎక్కడికి వెళ్లినా పసుపు తాడు తో కనిపిస్తాను అని చెప్పింది