గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'బాల రామాయణం' (1997) లో రాముడిగా మెప్పించిన ఎన్టీఆర్

'నిన్ను చూడాలని' (2001) సినిమాతో కథానాయకుడిగా మొదటి సినిమా, తరువాత 'స్టూడెంట్ నంబర్ 1' తో 18ఏళ్లకే స్టార్ నటుడిగా ఎదిగిన ఎన్టీఆర్. దర్శకుడు రాజమౌళికి కూడా ఇదే మొదటి సినిమా.  

తరువాత వచ్చిన 'ఆది' (2002) హిట్ అవటంతో అతి చిన్న వయసులోనే ఎన్టీఆర్ స్టార్ డమ్ పెరిగింది 

రాజమౌళితో చేసిన 'సింహాద్రి' సూపర్ డూపర్ హిట్ అవటంతో, చిన్న వయసులోనే ఎన్టీఆర్ అగ్రనటుల జాబితాలో చేరిపోయారు 

మధ్యలో కొన్ని సినిమాలు అపజయం పాలైనా, 'టెంపర్' తో పుంజుకున్న ఎన్టీఆర్

'అదుర్స్' లో ఎన్టీఆర్ చేసిన చారి పాత్రకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు

దర్శకుడు కొరటాల శివతో మొదటిసారిగా 'జనతా గేరేజ్' పెద్ద విజయం సాధించింది

'అదుర్స్' లో రెండు పాత్రలు వేస్తే, 'జై లవకుశ' లో మూడు పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్ 

రాజమౌళితో నాలుగో సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఆస్కార్ అవార్డు అందుకోవటమే కాకుండా, ఎన్టీఆర్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది 

ఇప్పుడు అందరి కళ్ళూ 'దేవర' పైనే వున్నాయి, ఈ సినిమా అక్టోబర్ 10న వస్తోంది. కొరటాల శివ దర్శకుడు 

ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్న 'దేవర' రెండు భాగాలుగా వస్తోంది. 

'వార్ 2' తో బాలీవుడ్ లో ఆరంగేట్రం, 'కెజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఇంకో సినిమా. ఇప్పుడు ఎన్టీఆర్ టైము నడుస్తోంది