అతిలోక సుందరిని తలపించిన 'జాన్వీ'

 అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దేవర'తో తెలుగులో డ్రీమ్ డెబ్యూ చేశారు.

తంగా క్యారెక్టర్లో దే'వర'తో హొయలు పోయారు.

 లంగా ఓణితో 'పదహారేళ్ళ వయసు'ను గుర్తు చేశారు.

కానీ.. ఈ సినిమాలోని క్యారెక్టర్ డిజైన్ రంగస్థలంలోని సమంతని పోలి ఉందంటున్నారు కొందరు.

కలెక్షన్స్ సాధిస్తున్న.. నెగిటివ్ టాక్‌తో ఇది జాన్వీ‌కి డ్రీమ్ డెబ్యూ‌గా మిగలలేకపోయింది.

 సినిమాలో ఆమె పాత్రకి పెద్ద స్కోప్ లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

 అద్భుతమైన డ్యాన్స్‌లతో అందాన్ని ఒలికించిన 'దావూదీ' పాటను సినిమా నుండి తొలిగించడంతో ఫ్యాన్స్ మరింత డిజప్పాయింట్ అయ్యారు.

ఇక 'చుట్టమల్లే' సాంగ్ కూడా చిత్రీకరణలో 'రెక్సోనా సోప్' యాడ్‌ని తలపించినట్లుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

కనీసం పార్ట్ 2 లోనైనా జాన్వీకి న్యాయం చేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.