దేవ‌ర పాట‌.. జాన్వీ గ‌త్త‌ర లేపుతుందిగా!

జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'

ఈ సినిమాతో శ్రీదేవి గారాల ప‌ట్టి బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి, సౌత్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతోంది

 బాలీవుడ్‌లో ఆరేండ్లలో ఓ ప‌ది చిత్రాలలో న‌టించినా ఇప్ప‌టివ‌ర‌కు

ఒక్క హిట్ కొట్ట‌లేక, రావాల్సినంత గుర్తింపు ద‌క్కించుకోలేక పోయింది

త‌న అందాల‌తో బాలీవుడ్‌లో నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చినా

ఛాన్సులు ద‌క్కించుకోవ‌డంలో  ఈ సుంద‌రి చాలా వెనుక‌బ‌డింది

 అయితే తాజాగా ఈ అమ్మ‌డు తెలుగు సినిమాలపై దృష్టి పెట్ట‌డంతో  దేశ‌ వ్యాప్తంగా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది

ఈ క్ర‌మంలో ఎన్టీఆర్‌తో సినిమా కాకుండా 

రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ మూవీ  చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది

 తాజాగా దేవ‌ర సినిమా నుంచి ఎన్టీఆర్‌, జాన్వీల‌పై చిత్రీక‌రించిన 

చుట్ట‌మ‌ల్లే పాట‌ సోష‌ల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది

అంతేకాదు యూ ట్యూబ్‌లో  సాంగ్ విడుద‌లైన‌ రెండు రోజుల్లోనే

2 కోట్ల 45 ల‌క్ష‌లకు పైగా వ్యూస్‌తో రికార్డులు తిర‌గ‌రాస్తూ చ‌రిత్ర‌ను లిఖిస్తోంది

ఈ పాట విడుదలైన  ముహూర్తం మహీమేమో గానీ 

ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి నోళ్లలో జాన్వీ పేరే నానుతుంది

ఆ పాట‌లో అమ్మ‌డి గ్లామ‌ర్‌,  ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ, అందాల ప్ర‌ద‌ర్శ‌న,

విజువ‌ల్స్‌, సంగీతం యువ‌త‌ను ఓ రేంజ్‌లో మెస్మ‌రైజ్ చేస్తోంది

దీంతో కుర్ర‌కారంతా న‌వ యువ శ్రీదేవి అంటూ ఆరాదించ‌డం మొద‌లు పెట్టేశారు

పాట‌లోని స‌న్నివేశాలను ఫొటోలుగా మార్చుకుని

మొబైల్ వాల్‌పేప‌ర్‌గా చేసుకుంటున్నారు

ఇప్పుడీ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో

బాగా వైర‌ల్ అవుతూ నేష‌న్ వైడ్‌గా

జాన్వీ, దేవ‌ర పేర్లు  ట్రెండింగ్‌లో ఉంటున్నాయి

మీరూ ఓ సారి ఆ ఫొటోల‌పై లుక్కేయండి.. ఆస్వాదించండి