పెళ్లికి ముందే..  శోభిత ఐటం సాంగ్?

శోభిత దూళిపాళ మ‌రో కొద్ది రోజుల్లో అక్కినేని వారి ఇంట అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే

 ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగ చైత‌న్య‌, శోభిత జంట కొద్ది రోజుల్లోపెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు

అయితే తాజాగా శోభిత‌కు బ‌డా బాలీవుడ్ ప్రోడ‌క్ష‌న్ హౌజ్ నుంచి ఓ బంఫ‌రాఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది

షారుఖ్‌, ర‌ణ్ వీర్ సింగ్ వంటి  అగ్ర హీరోలు న‌టిస్తున్న డాన్‌3 సినిమాలో

ఓ ఐటం సాంగ్ కోసం శోభితను సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం

ఈ విష‌య‌మై ఇప్పటికే శోభితతో చ‌ర్చ‌లు ముగిసిన‌ట్లు తెలుస్తోంది

అయితే  శోభిత త‌న కేరీర్‌లో  ఎన్న‌డూ ఐటెం సాంగ్ చేయలేదు

నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమైన  శోభిత మ‌రి ఈ ఐటం సాంగ్‌కు

 గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా, ఇస్తుందా అనే విష‌యం తెలియాల్సి ఉంది

కొద్ది రోజుల్లో అధికార  ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది

ఇదిలాఉండ‌గా గ‌తంలో చైతన్య సమంత పెళ్లి తరువాత 

అక్కినేని ఫ్యామిలీ సమంతకు  ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వ‌గా చైతన్య బాగా ప్రోత్సహించాడు

ఆ క్ర‌మంలో సమంత బోల్డ్ రోల్స్ చేయడం అవే వారి మ‌ధ్య‌ విభేదాలకు కారణమ‌నే ప్రచారం కూడా నడిచింది

 చైతన్యతో విడాకులు జరిగిన నెలలోపే పుష్ప సినిమాలో సమంత గాటు ఐటైం సాంగ్ కూడా చేసింది

అప్పుడు స‌మంత‌కు  ఇచ్చిన‌ట్టుగానే ఇప్పుడు శోభిత సినిమాల్లో న‌టించ‌డానికి

చైతన్య, ఫ్యామిలీ ఒప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది

సమంత చైతన్య విడాకుల విషయంలో ప్రముఖంగా వినిపించిన

బోల్డ్ రోల్స్‌ను శోభిత ముందు  నుంచే పోషించి పేరు తెచ్చుకుంది

మ‌రి ఇప్పుడు దర్శకుడు  ఫరాన్ అక్తర్ ప‌ట్టుబ‌ట్టి మ‌రి 

డాన్ 3 సినిమాలో ఐటం సాంగ్  ఆఫ‌ర్ ఇచ్చారని తెలుస్తోంది

 మరీ ఈ ఛాన్స్ ను శోభితా ఉపయోగించుకుంటుందా.. 

 శోభితకు ఫ్యామిలీ  నుంచి సపోర్ట్ లభిస్తుందా

 అనే ఆసక్తికరమైన చర్చ  సోషల్ మీడియాలో నడుస్తొంది