సింగర్‌ శ్వేతా మోహన్ గురించి ఈ విషయాలు తెలుసా?

'మాస్టారు మాస్టారు.. నా మనసును దోచారు' పాట గుర్తుందా? శ్వేతా మోహన పాడిన పాట అది. 

ప్రముఖ గాయని సుజాత మోహన్ కుమార్తె  శ్వేతా మోహన్. చెన్నైలో పుట్టి పెరిగారు.

మోహన్

తన చిరకాల మిత్రుడు అశ్విన్ శశిని పెళ్లి చేసుకుంది. ఆమెకు శ్రేష్ఠ అశ్విని అనే ఓ పాప ఉంది.

తొమ్మిదేళ్ల వయసు నుంచి కర్ణాటిక్‌ మ్యూజిక్‌ మీద దృష్టి సారించింది. 'బొంబాయి’ చిత్రంలోని 'కుచ్చికుచ్చి రక్కమ’ పాటకు కోరస్‌ పాడింది. అదే ఆమె తొలిపాట.

అక్కడి నుంచి దక్షిణాదితోపాటు హిందీలో అగ్ర సంగీత దర్శకులు అందరి సంగీతంలోనూ అద్భుతమైన పాటలు పాడారు.

ఇప్పటిదాకా 800లకు పైగా పాటలు పాడిన ఆమె ఫిల్మ్‌ఫేర్‌, తమిళనాడు, కేరళ స్టేట్‌ అవార్డులు అందుకున్నారు.

తెలుగులో దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో పాడిన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

'గబ్బర్‌ సింగ్‌'లో దిల్‌సే, 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’లో 'చెలి చమకు’, ఖలేజాలో 'పిలిచే పెదవులపైనా’, 'సార్‌' చిత్రంలో మాస్టారు మాస్టారు పాటలతో అలరించారు.

తన సింగింగ్‌ కెరీర్‌కు తల్లి సుజాత మోహన్, లతా మంగేష్కర్‌, కె.ఎస్‌ చిత్ర స్ఫూర్తి అని శ్వేత చెబుతారు

మ్యూజిక్‌ ఇండియా(2015) టీవీ షో నుంచి   తెలుగులో వస్తున్న సూపర్‌సింగర్స్‌-3 వరకూ ఎన్నో సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల శక్తి, సామర్థ్యాలను చాటేలా ‘స్త్రీ’ అనే ఓ ఆల్బమ్ శ్రోతల ముందుకు తీసుకు రాబోతోన్నారు  శ్వేతా మోహన్.

సామాజిక సమస్యలపై దృష్టి తీసుకురావడానికి, మహిళా సాధికారతను తెలియజేయడానికి, మహిళా శక్తిని అందరికీ చాటేలా చేసేందుకు ఈ సంగీత ప్రయాణం తోడ్పడటం ఆనందంగా ఉందన్నారు.