అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం చెప్పిన నిత్యామేనన్
నటిగా సెలక్టివ్ పాత్రలు ఎంచుకుని తన నటనతో అందరినీ ఫిదా చేస్తుంటారు నిత్యామేనన్.
ఇటీవల ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆమె అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయాన్ని పంచుకున్నారు.
అదేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
చాలా మంది నా ఇంటి పేరు మేనన్. నా స్వస్థలం కేరళ అనుకుంటారు.
నిజానికి నా ఇంటి పేరు మేనన్ కాదు. నా పేరు ఎన్.ఎస్. నిత్య.
ఎన్ అంటే మా అమ్మ నళిని. ఎస్ అంటే మా నాన్న సుకుమార్.
మాది బెంగుళూరు. మా కుటుంబం మూడు తరాలుగా బెంగుళూరులోనే ఉంటోంది.
మేమంతా ఇంటి పేరును గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాం.
మా కులమిదని చెప్పుకోవడం కూడా మాకు ఇష్టం ఉండదు.
కేవలం న్యూమరాలజీ ఆధారంగా నా పేరు తర్వాత ‘మేనన్’ జతచేసుకున్నానని తెలిపింది నిత్య.
దీంతో అంతా నిత్యామేనన్ చాలా తెలివిగలదే అని అనుకుంటున్నారు.
Related Web Stories
అలా.. ఇలా శ్రీలీల
‘రాయన్’ చెల్లిని.. ఇలా ఎప్పుడైనా చూశారా
ఓనమ్.. తనివితీరని అందం
ఎమ్మీ అవార్డ్స్.. హాలీవుడ్ తారల అందాల విందు