శ్రేయా ఘోషాల్‌ గురించి ఆసక్తికర విషయాలు.. ఇష్టాయిష్టాలేంటో తెలుసా?

శ్రేయాఘోషాల్‌ వెస్ట్‌ బెంగాల్‌లోని బెర్‌హామ్‌పూర్‌లోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. నాలుగేళ్ల వయసు నుంచే పాడటం మొదలుపెట్టారు.

సింగర్‌గా తెలుగు ఎంట్రీ ఇళయరాజా సంగీతంలో జరిగింది. అందుకు కారణం ఆయన కుమారుడు కార్తీక్‌ రాజా కారణం.

ఒక్కడు’ సినిమాలో ‘నువ్వేం మాయ చేసావో కానీ’ పాటతో గుర్తింపు వచ్చింది.

పలు స్టేట్, ఫిలిం ఫేర్ అవార్డ్స్ తో పాటు అయిదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

ప్రపంచంలో ఎక్కడ షో చేసినా తప్పకుండా ఆమె  ఆ పాట పాడాల్సిందే. తెలుగువారున్న ప్రతి చోటా ఫ్యాన్  ఫాలోయింగ్‌ ఉందని ఆనందిస్తుంటారు.

చదువు, సేవా కార్యక్రమాలు ఎన్ని రకాల పనులున్నా మొదటి ప్రయారిటీ మాత్రం సంగీతమే. గానం కోసమే ఈ జీవితం.

శ్రేయా చదివిన సెంట్రల్‌ స్కూల్లో ఫైన్‌ ఆర్ట్స్‌, సంగీతం రంగంలో ప్రోత్సాహం తక్కువ.

మోరల్‌ సపోర్ట్‌ అనేది మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లగలదు అని అప్పుడే అర్థమైంది.

తెలుగులో నాకు హిట్‌ సాంగ్స్‌ ఎక్కువ. వాటిలో ప్రేక్షకాదరణ పొందిన ప్రతి పాట హైదరాబాద్‌ వచ్చి పాడినదే!