మిథున్ చక్రవర్తి గురించి ఈ విషయాలు తెలుసా..
సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ మిథున్ చక్రవర్తిని వరించింది
బాలీవుడ్ విలక్షణ నటుడిగా మిథున్ చక్రవర్తికి పేరు.
అక్టోబర్ 8న జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్‌లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు
మిథున్ చక్రవర్తి ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు
బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి దంపతులకు 1950 జూన్ 16న కోల్‌కతాలో మిథున్ చక్రవర్తి జన్మించారు.
ఆయన అసలు పేరు గౌరంగా చక్రవర్తి
సమాజంలో పెత్తందారివ్యవస్థతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఉద్యమబాట పట్టారు
1976లో ఆయన నటుడిగా ‘మృగాయ’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు
తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు
ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో ఆయన నటించి స్టార్ యాక్టర్‌గా మారారు
1989లో ఒకే ఏడాదిలో అత్యధికంగా 19 సినిమాలు విడుదలైన హీరోగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు
హిందీతో పాటు బెంగాలీ, కన్నడ, ఒరియా, భోజ్‌పురి, తెలుగు చిత్రాల్లోనూ ఆయన నటించారు.
విక్టరీ వెంకీ, పవన్‌ల ‘గోపాల గోపాల’ సినిమాలో స్వామిజీగా ‘థ్యాంక్యూ’ అంటూ తన విలక్షణ నటనతో తెలుగు వారికీ సుపరిచితమయ్యారు.
మిథున్ పేరు వినగానే గుర్తొచ్చే పాట ‘ఐ యామే డిస్కో డాన్సర్’.
ఈ ఏడాది ఆరంభంలో పద్మభూషణ్ అవార్డును కేంద్రం అందజేసింది. ఇప్పుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుతో ఆయన పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
మిథున్ పేరు వినగానే గుర్తొచ్చే పాట ‘ఐ యామే డిస్కో డాన్సర్’.
Related Web Stories
అచ్చ తెలుగు అందం.. ప్రణవి మానుకొండ
శారీలో నిజంగానే ‘నిధి’.. ఏమా అందం..
IIFAలో 'యానిమల్' ఊచకోత
ఐఫా అవార్డుల్లో.. కథానాయికలు