హిమజ గురించి ఈ విషయాలు తెలుసా?

హిమజ వైజాగ్‌లో పుట్టారు. పదో తరగతి వరకూ గుంటూరులోని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకున్నారు

2010లో ఎం.బి.ఏ పూర్తి చేసి వనస్థలిపురంలో ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత చిన్న కంపెనీలో కొన్నాళ్లు హెచ్‌.ఆర్‌గా జాబ్‌ చేసి మానేశారు. తర్వాత రూట్‌ మార్చి యాక్టింగ్‌ వైపు వచ్చారు

చేతిలో పని, దానితో ఆత్మ సంతృప్తి ఉన్నంత వరకూ భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా స్టెప్‌ వేసే ముందు ఆలోచిస్తానంతే

నేను కారు కంటే ‘ఎవరో కొనిచ్చారట’ అంటూ కామెంట్స్‌ చేశారు. వాయిదాలు కట్టేవాళ్లకి తెలుస్తుంది ఆ నొప్పి

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని అలరించింది

సీనియర్‌ ఆరిస్ట్‌ రాధలా ఉంటాననీ, రజనీ ఫేస్‌కట్స్‌ నాలో ఉన్నాయని కొందరు అంటుంటారు. మంచి కాంప్లిమెంట్‌ అనుకుంటా.

‘వేదం’ సినిమా నుంచి నేను అనుష్కకు పెద్ద అభిమానిని. ఆర్టిస్ట్‌గా నాకు ఆమె ఎంతో స్ఫూర్తినిస్తుంది

కారణం లేకుండా మాట అంటేపడే తత్వం కాదు నాది. కారణం లేకుండా నా జోలికి వస్తే ఫటాఫట్‌ అంతే.

నేను శైలజా’, ‘ధృవ’, ‘మహానుభావుడు’, ‘శతమానం భవతి’, ‘స్పైడర్‌’, ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘రచయిత’, ‘వినయ విధేయరామ’ చిత్రాల్లో మెరిశారు.

వయసు మీద పడ్డాక జేజి పాత్రలు అయినా చేస్తాను కానీ ఇండస్ట్రీని మాత్రం వదలను

నా నవ్వు నాలో బెస్ట్‌ అని చాలామంది చెబుతుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండటం నా బలం