నా ఫేవరెట్‌ క్రికెటర్ ఎవరంటే

పూజా హెగ్డే ఈ పేరుకి పరిచయం అవసరం లేదు

సౌత్, నార్త్ అనే కాకుండా అన్ని వుడ్‌లలో పూజా తన సత్తా చాటింది. 

ప్రస్తుతం పూజా హెగ్డేకు సినిమా అవకాశాలు తగ్గినా.. 

ఒక్క అవకాశం చాలు మళ్లీ తన టాలెంట్ చూపిస్తానంటోందీ భామ.

తాజాగా ఈ భామ తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పుకొచ్చింది. 

ఇప్పటికే చాలా సార్లు తన అభిమాన క్రికెటర్ గురించి చెప్పిన పూజా.. మరోసారి మాట్లాడింది.

నా ఆల్‌టైం ఫేవరెట్‌ క్రికెటర్‌ వన్‌ అండ్‌ ఓన్లీ రాహుల్‌ ద్రవిడ్‌. 

నేను ఆయనకు ఎంత పెద్ద ఫ్యానో మాటల్లో చెప్పలేను.

ఆయన కూల్‌ అండ్‌ క్లాసిక్‌ ప్లేయర్‌. 

చిరాకు పడడం, కోప్పడటం నేను ఎప్పుడూ చూడలేదు. 

నా దృష్టిలో ఆయనో జెంటిల్‌మెన్‌. 

ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా... 

ద్రవిడ్‌కు సాటిరారు. ఆయనో మాస్టర్‌ పీస్‌ అంతే.