తలకిందులుగా.. మృణాల్‌తో మామలుగా ఉండదు 

‘సీతారామం’ చిత్రంతో మంచి గుర్తింపును పొందింది మృణాల్‌ ఠాకూర్‌

తెలుగులోనే కాకుండా, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతుందీ భామ.

అదే సమయంలో ఆరోగ్యంపై కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

నిత్యం వ్యాయామం, వర్కౌట్లు చేస్తు శరీరాన్ని నాజూగ్గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. 

ఈ క్రమంలో ఆమె ఓ జిమ్‌లో తలకిందులుగా వర్కౌట్లు చేస్తూ కనిపించింది.

ఈ వ్యాయామానికి సంబంధించిన వీడియో, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

మరోవైపు తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి కానీ..

కోలీవుడ్‌లో ప్రతాపం చూపాలనుకున్న తనకు ఒక్క అవకాశం కూడా లభించడం లేదు. 

ఇతర భాషల్లో నటించిన చిత్రాలు తమిళంలో విడుదల చేస్తున్నారంతే. 

అలా తెలుగు ప్రేక్షకులకే కాకుండా కోలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా ఆమె చేరువైంది.