వడ్డేపల్లి శ్రీనివాస్‌ పాడిన సినిమా పాటలివే..

ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూశారు

అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం సికింద్రాబాద్‌ పద్మారావు నగర్‌లోని తన నివాసంలో మృతిచెందారు.

జానపద గేయాలతో అలరించిన ఆయన.. ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్‌ సాంగ్స్‌ పాడారు

ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లోనే కాకుండా.. కొన్ని సినిమా పాటలు కూడా పాడారు.

‘గబ్బర్‌సింగ్’ సినిమాలోని ‘కన్నులాంటి గన్నులున్న’ పాట ఆయనను పాపులర్ చేసింది.

‘కింగ్‌’ చిత్రంలో ‘ఎంత పని చేస్తివిరో’ పాట అప్పట్లో వైరలైంది

‘బెంగాల్ టైగర్’‌లో ‘రాయే రాయే చిన్ని’తో రచ్చ రచ్చ చేశారు

‘నమస్తే అన్న’ సినిమాలో ‘గరం గరం ప్యారి’ పాట పాడింది వడ్డేపల్లి శ్రీనివాసే.