ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ  ప్రముఖులు భేటీ అయ్యారు

భేటీ అనంతరం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియా తో మాట్లాడారు

జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం ఉందని..

తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు

హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు

డ్రగ్స్ విషయంలో కూడా సినీ పరిశ్రమ ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని

నటీనటులతో డ్రగ్స్ నిర్మూలనపై కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు

ఇండస్ట్రీ, ఎఫ్‌డీసీ, ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారని.. 

ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు

సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఉంటుందని అన్నారు