నిధి అగర్వాల్‌కి నచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా..

నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరో కాదు.. మేమిద్దరం బెంగుళూరుకు చెందినవాళ్లమే. 

నా స్నేహితుడు కేఎల్‌ రాహుల్‌. 

ఎన్నో ఏళ్లుగా మేమిద్దం ఒకరికొకరం బాగా తెలుసు. 

రాహుల్‌ క్రికెటర్‌ అవ్వకముందు, నేను నటిని కాకముందు నుంచే 

మా ఇద్దరికి మంచి పరిచయం ఉంది. 

అప్పట్లో ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం. 

ఎక్కువగా రెస్టారెంట్స్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొని లాగించేవాళ్లం.

ఆ తర్వాత మా వృత్తుల్లో బిజీ అయిపోయాం. 

వీలు చిక్కినప్పుడల్లా మెసేజ్‌లు చేసుకుంటూ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం.