ఒకప్పుడు ఆ క్రికెటర్ నా క్రష్‌: కాజల్

స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఏలింది కాజల్ అగర్వాల్.

ఇప్పుడు పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా నటిస్తోంది.

రీఎంట్రీలో ఆమె మంచి కథలను ఎన్నుకుంటూ దూసుకెళుతోంది.

తాజాగా ఆమె తనకిష్టమైన క్రికెటర్ గురించి చెప్పుకొచ్చింది. 

ఆ క్రికెటర్ ఎవరో, ఎందుకు ఇష్టమో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మపై ఒకప్పుడు క్రష్‌ ఉండేది.

రోహిత్‌లోని నాయకత్వ లక్షణాలు, ఆటతీరు నన్ను బాగా ఆకట్టుకుంటాయి.

అతను బ్యాటింగ్‌ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

బరిలోకి దిగితే డబుల్‌ సెంచరీ కొట్టందే ఫీల్డ్‌ బయటకు రాని అతడి తెగువ ఎంతో గొప్పది.

రోహిత్‌ ఆడే మ్యాచ్‌లను మిస్‌ అవ్వకుండా చూస్తుంటా. 

నేనే కాదు.. మా ఇంట్లో అందరం రోహిత్‌ అభిమానులమే.

అని తన అభిమాన క్రికెటర్ గురించి తెలిపిందీ సత్యభామ.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కాజల్ బిజీ నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.